top of page

నేటి నుంచే హైదరబాద్ బుక్ ఫెయిర్


 హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం(19) నుంచి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్(హెచ్బీఎఫ్)ను నిర్వహిస్తున్నమని, దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్బీఎఫ్ అధ్యక్షుడు డా. యాకూబ్ షేక్ తెలిపారు. బుక్ ఫెయిర్ లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో దేశవ్యా ప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణక ర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించను న్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాలవేదికకు రచయిత్రి, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్ గా నామకరణం చేశాం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు కె.రామ చంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కోటేలతో సలహా కమిటీని ఏర్పాటు చేశాం. తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తాం" అని వివరించారు. ఈ సమావేశంలో హెచ్బీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్(వాసు), కోశాధికారి పి.నారాయ ణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.- ఈనాడు 19.12.2024

Comments


bottom of page