top of page

పుస్తకాలకు ఆదరణ ఎన్నటికీ తగ్గదు

Updated: Nov 10




ప్రెస్​ రిలీజ్​

– హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​  సొసైటీ గౌరవ సలహాదారులు ఎమ్మెల్సీ కోదండరాం

-బుక్​ ఫెయిర్​ లోగో ఆవిష్కరణ


టెక్నాలజీ, ఈబుక్స్​, ఆన్​లైన్​ ​ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గదని  హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ సొసైటీ గౌరవ సలహాదారులు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఇంటర్నెట్​ కాలంలో కూడా పుస్తకాలను చదవే పాఠకులు నిరంతరం పెరుగుతూ ఉంటారని చెప్పారాయన. సోమవారం సోమాజిగూడ ప్రెస్​ క్లబ్ లో  హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ సొసైటీ  గౌరవ సలహాదారులను బుక్​ ఫెయిర్​ కమిటీ సభ్యులు ప్రకటించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ కోదండ రాం, సీనియర్​ ఎడిటర్​ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్​ రమా మెల్కొటే ఈసారి నిర్వహించే బుక్​ ఫెయిర్​కు గౌరవ సలహాదారులుగా ఉంటారని ​ బుక్​ ఫెయిర్​ అధ్యక్షులు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా బుక్​ ఫెయిర్​ కమిటీ సభ్యులతో కలిసి 37వ బుక్​ ఫెయిర్​ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండ రామ్​, రామచంద్రమూర్తి రమా మెల్కొటే మాట్లాడుతూ.. హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప మహోత్సవం అని, సాహితీ ప్రియులు, పాఠకులు, విద్యార్థులు, యువత, ఎంతో మంది ఈ పుస్తక మహోత్సవం కోసం వేచి చూస్తుంటారని అన్నారు. రచయితలను, పాఠకులను కలిపే వేదికగా బుక్​ ఫెయిర్​ ప్రముఖ్యాన్ని సంతరించుకుందని చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. వందలాది పబ్లిషింగ్​ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్​ఫెయిర్​ సెక్రటరీ వాసు మాట్లాడారు. డిసెంబర్​ 19 నుంచి 29 వరకూ హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహించబోయే బుక్​ ఫెయిర్​కు ప్రజలు తరలిరావాలని కోరారు. సందర్శకుల కోసం అనుకూలమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్​ నిషేధాన్ని పాటిస్తూ.. సందర్శకుల కోసం టికెట్లతో పాటు పుస్తకాల కోసం ‘సంచి’ని ఇస్తామని పేర్కొన్నారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పదిలక్షలకుపై పైగా జనం విజిట్​ చేస్తారని తెలిపారు. విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఆయన వివరించారు. వివరాల కోసం 9490099081 ను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణరెడ్డి, వైస్​ ప్రెసిడెంట్లు కె. బాల్​ రెడ్డి, శోభన్​ బాబు, జాయింట్​ సెక్రటరీలు కె. సురేశ్​, ఎం. సూరిబాబు పాల్గొన్నారు.

댓글


bottom of page