top of page
Search

డిసెంబర్ 19 నుంచి 37వ హైదరాబాద్​ బుక్​ఫెయిర్​

Updated: Oct 28, 2024


  • పోస్టర్​ ఆష్కరించిన మంత్రి జూపల్లి

    నేటి సమాజంలో పుస్తకాలు చదివే సంస్కృతి మరింత పెరగాలని తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన క్యాంప్​ ఆఫీస్​లో 37వ హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ పోస్టర్​ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా హైదరాబాద్​లో జరిగే బుక్​ ఫెయిర్​ సమాజంలో పుస్తకాలు చదివే సంస్కృతిని పెంచుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్​ 19 నుంచి 29 వరకూ ఎన్టీఆర్​ స్టేడియంలో పదిరోజుల బుక్​ ఫెయిర్​ జరుగుతుందని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా హైదరాబాద్​ నగరంలో పుస్తక మహోత్సవం నిర్వహించే ఆనవాయితిని కొనసాగించడం హర్షనీయం అని బుక్​ ఫెయిర్​ నిర్వహకులను అభినందించారు. పదిరోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పుస్తక ప్రియులు, విద్యార్థులు, రచయితలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు యాకూబ్​ మాట్లాడుతూ.. బుక్​ఫెయిర్​ నిర్వహణకు సహాకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుక్​ఫెయిర్​లో ప్రచురణ కర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బుక్​ ఫెయిర్​ జనరల్​ సెక్రటరీ ఆర్​. వాసు మాట్లాడారు. బుక్​ ఫెయిర్​లో విజిటర్లకు, రచయితలకు, స్టాల్​ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 250కి కు పైగా జాతీయ, అంతర్జాతీయ పబ్లిషర్లు పాల్గొంటారని, పదిలక్షలకుపై పైగా జనం విజిట్​ చేస్తారని తెలిపారు. విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణ రెడ్డి, వైస్​ ప్రెసిడెంట్లు కె. బాల్​ రెడ్డి, శోభన్​ బాబు, జాయింట్​ సెక్రటరీలు కె. సురేశ్​, ఎం. సూరిబాబు, ఈసీ సభ్యులు జనార్ధన్​ గుప్తా విజయారావు, మధుకర్​, కోటేశ్వర రావు, శ్రీకాంత్​, శ్రీనివాసరావు, సాంబశివరావు, స్వరాజ్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

     #BookFair2024 #37thHyderabadBookFair #HyderabadBookFair2024

    #SelfPublished #IndependentAuthors #HyderabadBookFair #WritersCommunity #BookLovers #AuthorLife #BookPromotion #LiteraryEvent #IndieAuthors #BookStall #ReadLocal #BookSigning #Publishing #WritersOfInstagram


 
 
 

Comments


Hyderabad book Fair

contact : 9490099081

Contact

4-4-1, 1st floor, Dishan plaza, sultan bazar, hyderabad 500095

  • Instagram
  • Facebook
  • Youtube

Stay connected!

Follow us on social media for the latest updates and promotions.

Site  Design & Developed by 

bottom of page